బలిచక్రవర్తి వామనుడికి మూడడుగుల భూమిని దానం చేసిన సందర్భంలో పోతనగారి కవితాఝరిలోని అమృతగుళికలు. కథ
అంతరార్ధం: జీవ ప్రజ్ఞయే బలి. విశ్వజిద్యాగము అంటే సమస్తమును దానము చేయుట వలన దానియందు తనకుగల కొేరికను జయించుట. ఇలా సర్వమును త్యజించుట వలన సమస్తమునందు విష్ణువుని దర్శించే యజ్ఞఫలము లభించింది. నేను అనే అహం అదః పాతాళానికి నెట్టవేయబడంది. వామనుడనగా పొట్టివాడని అర్ధం.అనగా అణువులందు కణములందు ఇమిడి ఉన్న అంతర్యామి ప్రజ్ఞ.
- వడుగా యెవ్వరివాడ వెవ్వడవుసంవాసస్థలంబెయ్య ది
య్యెడకున్ నీవరుదెంచుటన్ సఫలమయ్య
న్ వంశమున్ జన్మముం
గడు ధన్యాత్ముడనైతి నీ మఖము యొాగ్యంబయ్యె శిఖులుం; గళ్యాణమిక్కాలమున్ - వరచోలంబులో మాడలో ఫలములో వన్యంబులోగోవులో
హరులో రత్నంబులో రధంబులో విమృష్టాన్నంబులో కన్యలో
కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో ధరణీఖండమొ కాక యేమడిగెదో ధాత్రిసురేంద్రోత్తమా - ఇదినాకు నెలవని యేరీతి పలుకుదు నొకచోటనక యెందు నుండనేర్తు
నెవ్వనివాడనం చేమని పలుకుదు నాయంతవాడనై నడవనేర్తు
నీ నడవడి యని యెట్లు వక్కాణింతు బూని ముప్పొేకల బోవనేర్తు
నది నేర్తునిది నేర్తునని యేల చెప్పంగ నేరుపులన్నియు నేన నేర్తు
నొరులుగారు నాకు నొరులకు నేనౌదు , ఏంటివాడ జుట్టమొకడులేడు
సిరిణుదొల్లి గలదు చెప్పెద నాటెంకి, సుజనులందుదెఱచు సొచ్చియుందు - ఒంటివాడ నాకు ఒకటి రెండడుగుల, మేరయిమ్ము సొమ్ము మేర యొల్ల
గోర్కి దీర బ్రహ్మకూకటి ముట్టెద,దానకుతసాంద్ర!దోనవేంద్ర - ఆదిన్ శ్రీసతి కొప్పుపై దనువుపై నంసొేత్తరీయంబుపై
బాదాబ్జంబుపై గపొేలతటిపై బాలిండ్లపైనూత్నమ
ర్యాందంత్యజిదుకరము గ్రిందగుట మీదై నా కరంబుండుట మేల్గా
దే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే - ఇంతింతై వటుడింత యై మఱియు దా నిం తై నభోవీధిపై
నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రునికంత యై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్యపదొేన్నతుండగుచు బ్రహ్మాండాంతసంవర్ధియై
అంతరార్ధం: జీవ ప్రజ్ఞయే బలి. విశ్వజిద్యాగము అంటే సమస్తమును దానము చేయుట వలన దానియందు తనకుగల కొేరికను జయించుట. ఇలా సర్వమును త్యజించుట వలన సమస్తమునందు విష్ణువుని దర్శించే యజ్ఞఫలము లభించింది. నేను అనే అహం అదః పాతాళానికి నెట్టవేయబడంది. వామనుడనగా పొట్టివాడని అర్ధం.అనగా అణువులందు కణములందు ఇమిడి ఉన్న అంతర్యామి ప్రజ్ఞ.
No comments:
Post a Comment