Wednesday, June 7, 2017

శ్రీమన్నారయణుని అవతారములు

శ్రీమన్నారయణుని అవతారములు

మనం సాధారణంగా దశావతారాలనిగురించే మాట్లాడుకుంటూ ఉంటాము. భాగవతంలోని ద్వితీయస్కందములో బ్రహ్మదేవుడు నారదుడికి శ్రీమన్నారాయణుని లీలావతారాలను వర్ణించారు.భూమిమీద ధూళికణాలనైనా లెక్కపెట్టవచ్చేమోకాని శ్రీహరి అవతారాలను లెఖ్ఖపెట్టలేమని చెప్తూ సంగ్రహంగా అవతారాలను వివరిస్తారు.


  1. యజ్ఞవరాహఅవతారం: హిరణ్యాక్షుడనే రాక్షసుడు బాహుబలంతో  భూచక్రాన్ని చాపచుట్టినట్టు చుట్టి సముద్రంలేే దాగుకున్నాడు.అపుడు శ్రీమన్నారయణుడు యజ్ఞ వరాహరూపం దాల్చి, వానిని ఎదిరించి సముద్రమధ్యంలో వానిని తన కొేరలతొే సంహరించాడు.
  2. సుయజ్ఞావతారం: రుచి అనే ప్రజాపతికి, స్వాయంభువుని కూతురైన ఆకూతికి జన్మించిన సుయజ్ఞుడు దక్షిణ అనే పత్నియందు సుయములనే పేరుగల అమరులను పుట్టించాడు. ఇంద్రుడై దేవతలకు నాయకత్వం వహంచాడు. విష్ణువై లోకాలన్నిటి దుఖ్ఖాలను తొలగించాడు
  3. కపిలావతారము:  దేవహూతి కర్దమ ప్రజాపతికి శ్రీహరి కపిలుడుగా పుట్టాడు. సాంఖ్య యోగాన్ని తన తల్లికి చెప్పాడు
  4. దత్తాత్రేయఅవతారం
  5. సనక సనత్కుమార సనంద సనాతన నరనారాయణఅవతారం
  6. ధర్మునికి దక్షుని కూతురైన మూర్తియందు నర నారాయణులు పుట్టారు
  7. దృవావతారం
  8. పృదుచక్రవర్తి అవతారం: వేనుడనేరాజు బ్రాహ్మణశాపంతో  భాగ్యము పౌరుషము కోల్పోయి నరకంలో పడ్డాడు. అప్పుడతని కొడుకు పృదువు తండ్రిని పున్నామ నరకం నుండి రక్షించాడు. శ్రీహరి అంశతో పుట్టిన పృదువు భూమిని ఆవుగా చేసుకొని అమూల్యమైన వస్తు సముదాయాలను పిదికాడు
  9. ఋషబావతారం: భగవానుడికి నాభి అనే మహారాజుకు కొడుకుగా పుట్టి జడయోగాభ్యాసాన్ని ఒనరించెను
  10. బ్రహ్మదేవుడు నిర్వహంచిన యజ్ఙంలో శ్రీహరి హయగ్రీవ అవతారమున ప్రత్యక్షం అయ్యాడు
  11. మత్స్యావతారము
  12. కూర్మావతారము
  13. నృశింహావతారము
  14. ఆదిమూలావతారము: మొసలి గజేంద్రుని కాలు పట్టుకున్నపుడు ఆదిపురషా అఖిలలోకనాధా అని ఆర్తితో పిలిచినపుడు, భగవానుడు గజేంద్రడిని రక్షించాడు
  15. వామనావతారం
  16. హంసావతారం: నారదుడికి హంసావతారంలో భగవానుడు భక్తియోగాన్ని ఉపదేశంచాడు
  17. మన్వావతారంలో శ్రీహరి మను వంశజుడై, దుష్టులగు రాజులను దమనము చేసి వారిని పాలంచెను
  18. ధన్వంతరి అవతారము: జీవుల వ్యాధులను తొలగించుటకు ఆయుర్వేదమును విశ్వమందు ఆరంభించెను
  19. పరశరామావతారం
  20. రామావతారం
  21. కృష్ణావతారం
  22. వ్యాసావతారం: తన రచనయగు వేదము అల్పజ్ఞులకు కష్టతరమని భగవానుడు యుగపరిస్తితులను అనుసరంచి వేదవృక్షాన్ని భిన్న శాఖలుగా విభజించెను
  23. బుధ్ధావతారం
  24. కల్కావతారం.

ఈవిధంగా శ్రీహరి విశ్వము యొక్క ఉత్పత్తి స్థితి లయాలకు కారణభూతుడై విలసిల్లుతాడు.

ఉపచారాలు

ఉపచారాలు అన్నవి వేదాలలొే లేవు.ఆగమశాస్త్రప్రకారం దేవాలయాలలొే పూజలకోసం ఇవి సృతులలో పొందు పరచపడింది. ఉపచారలలో పంచఉపచారాలు, షడ ఉపచారాలు, దశ ఉపచారాలు, షోడసోపచారాలు. ఇవి గృహాలలోచేస్తారు.

చతుషష్టిఉపచారాలు దేవాలయాలలో చేస్తారు. సంగ్రహంగా అవి ఈవిధంగా ఉంటాయి:


  1. ప్రాతఃకాల సేవల, సుప్రభాతం, స్తోత్రాలు, దంతధావన, మంగళహారతి, జయజయధ్వనాలు, వందనం
  2. ముఖ్యపూజ: ధ్యానం, ఆవాహనం, ఆసనం, అర్ఘ్యం, ఆచమనీయం, మదుపర్కం, స్నానమాచరించడానికి ముందు పాదుకలు, మూర్తిసంస్కారం (చందనంతొలగింపు), తైలమర్దనం, సుగంధపుష్పాలతొే స్నానం, పంచామృతస్నానం, పంచామృతాలను తొలగించడం, శుద్ధోదకస్నానం, అంగవస్త్రం సమర్పణ, వస్త్రం, యజ్ఞోపవీతం, ఆచమనీయం, కేశాలంకారం, ఆభరణం, పుష్పం, దీపం, ధూపం, దిష్టి, నైవేద్యం, సుగంధద్రవ్యాలు, తాంబూలం, సుఖాసనం, తిరిగి గంధం, కిరీటం, పుష్పమాలలు, దర్పణం, చత్రం, చామరం, గానం, నృత్యం, వాయిద్యం, హారతి, పల్లకిసేవ, మూర్తిని ప్రత్యేకమండపానికి తీసుకువెళ్శడం,  తిరిగితీసుకొనిరావడం, పునరాచమనీయం, పాద్యం, అర్ఘ్యం, హారతి
  3. రాత్రి:  తాంబూలం, నీరాజనం, పవళింపుసేవ

బలిచక్రవర్తి కథ అంతరార్ధం

బలిచక్రవర్తి వామనుడికి మూడడుగుల భూమిని దానం చేసిన సందర్భంలో పోతనగారి కవితాఝరిలోని అమృతగుళికలు. కథ

  1. వడుగా యెవ్వరివాడ వెవ్వడవుసంవాసస్థలంబెయ్య ది
    య్యెడకున్ నీవరుదెంచుటన్ సఫలమయ్య
    న్ వంశమున్ జన్మముం
    గడు ధన్యాత్ముడనైతి నీ మఖము యొాగ్యంబయ్యె శిఖులుం; గళ్యాణమిక్కాలమున్
  2. వరచోలంబులో మాడలో ఫలములో వన్యంబులోగోవులో
    హరులో రత్నంబులో రధంబులో విమృష్టాన్నంబులో కన్యలో
    కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో ధరణీఖండమొ కాక యేమడిగెదో  ధాత్రిసురేంద్రోత్తమా
  3. ఇదినాకు నెలవని యేరీతి పలుకుదు నొకచోటనక యెందు నుండనేర్తు
    నెవ్వనివాడనం చేమని పలుకుదు నాయంతవాడనై నడవనేర్తు
    నీ నడవడి యని యెట్లు వక్కాణింతు బూని ముప్పొేకల బోవనేర్తు
    నది నేర్తునిది నేర్తునని యేల చెప్పంగ నేరుపులన్నియు నేన నేర్తు
    నొరులుగారు నాకు నొరులకు నేనౌదు , ఏంటివాడ జుట్టమొకడులేడు
    సిరిణుదొల్లి గలదు చెప్పెద నాటెంకి, సుజనులందుదెఱచు సొచ్చియుందు
  4. ఒంటివాడ నాకు ఒకటి రెండడుగుల, మేరయిమ్ము సొమ్ము మేర యొల్ల
    గోర్కి దీర బ్రహ్మకూకటి ముట్టెద,దానకుతసాంద్ర!దోనవేంద్ర
  5. ఆదిన్ శ్రీసతి కొప్పుపై దనువుపై నంసొేత్తరీయంబుపై
    బాదాబ్జంబుపై గపొేలతటిపై బాలిండ్లపైనూత్నమ
    ర్యాందంత్యజిదుకరము గ్రిందగుట మీదై నా కరంబుండుట మేల్గా
    దే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే
  6. ఇంతింతై వటుడింత యై మఱియు దా నిం తై నభోవీధిపై
    నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
    నంతై చంద్రునికంత యై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
    నంతై సత్యపదొేన్నతుండగుచు బ్రహ్మాండాంతసంవర్ధియై
బలిచక్రవర్తి  విశ్వజిద్యాగము చేసి ముల్లోకాలను జయించి ఇంద్రుడిని ఓడించాడు.అపుడు ఇంద్రుడి తల్లి అదితి తపస్సు చేసి విష్ణువుని మెప్పంంచి ఆయననే తన కొడుకుగా పొందింది.విష్ణువు వామనుడిగా అవతరించి బలి యాగస్థలికి వెళ్ళి మూడడుగుల నేలను దానమడితే దానికి అంగీకరంచిన బలి మూడడుగుల నేలను దానం ఇస్తాడు.అప్పుడు వామనుడు ఒక పాదముతొే భూమిని, ఒక. పాదముతొే ఆకాశాన్ని ఆక్రమించి మూడవ పాదాన్ని బలి అంగీకారంతొే అతని శిరస్సుపై ఉంచి ఇతనిని పాతాళీనికి అణచి వేస్తాడు.ఇది అందరికీ తెలుసిన కధ.ఇది బాహ్యర్ధం.

అంతరార్ధం: జీవ ప్రజ్ఞయే బలి.  విశ్వజిద్యాగము అంటే సమస్తమును దానము చేయుట వలన దానియందు తనకుగల కొేరికను జయించుట. ఇలా సర్వమును త్యజించుట వలన సమస్తమునందు విష్ణువుని దర్శించే యజ్ఞఫలము లభించింది. నేను అనే అహం అదః పాతాళానికి నెట్టవేయబడంది. వామనుడనగా పొట్టివాడని అర్ధం.అనగా అణువులందు కణములందు ఇమిడి ఉన్న అంతర్యామి ప్రజ్ఞ.