గణపతికి సిందూరం ఎందుకు రాస్తారు? గణపతిని త్రికోణ మధ్యగతం అని ఎందుకు నుతించారు?
తల్లి గర్భం శిశువుకి పోషణ ఇచ్చినట్లు మూలాధారచక్రం మనిషిలోని ఆధ్యాత్మిక ప్రగతికి ముాలస్థానమనిచ్చారు.అది చెట్టులోని వేరులాంటిది. మనిషిలోని పూర్వజన్మల కర్మల నిక్షిప్తస్థానంగా చెప్తారు.
మూలాధారానికి గణపతి ప్రతీక.దీని చిహ్నం ఏడు తొండాలతో ఉన్న ఏనుగు.ఇవి మనిషిలొేని సప్తధాతువులని, సప్త చైతన్య స్థాయిలని సూచిస్తుంది.
ఈచక్రానికి నాలుగు దళాలు ఉంటాయి. మనస్సుయొక్క నాలుగు చైతన్యస్థాయి మనో బుద్ధి చిత్త అహంకారాలని ఇది సూచిస్తుంది.అలాగే ఈ గ్రహం మీద ఉండే నాలుగురకాల జీవనాలని(స్వేదజాలు,అండజాలు,వృక్షజాలు,ఆకారంతో జన్మించే పశువులు మనుష్యులు) ఇది సూచిస్తుంది.
శివునిలోని శక్తి పశుపతి మహాదేవరూపంలో ఇక్కడ ఉంటుందంటారు. శివుడు చైతన్యానికి, స్వేచ్ఛకి కారణమంటారు. స్వేచ్ఛ అంటే మనలోని దుష్టశక్తులని సంహరించడం. పశుపతి మహాదేవ అంటే జంతువులను నియంత్రణలో ఉంచడం. మూలాధారచక్రం జంతు చైతన్యానికి మానవ చైతన్యానికి ఒక సరిహద్దు అని చెప్పవచ్చు.
అంటే జంతువులలో నిద్రాణంగా ఉండే చైతన్యస్థాయి నుండి మానవులలో బుధ్థి వికాసంచే స్థాయి వరకు ఎదగడం. శివునికి ఇరువైపులా రెండు శక్తులు ఉంటాయి. అసురీశక్తి దేవిశక్తి.
మూలాధారానికి ఇంకొక చిహ్నం శివలింగానికి మూడున్నర చుట్టలు చుట్టుకున్న సర్పం. శివలింగం సృజనాత్మకతకి ప్రతీక. మూడు చుట్టలు మనిషిలోని మూడు చైతన్య స్థాయిలకి సంకేతం. సగం చుట్ట పురోగమించిన చైతన్యానికి ప్రతీక. కిందకి ఉన్న సర్పం ముఖం యొక్క సూచన ఏమిటంటే పరిణామ క్రమంలొే ఊర్ధ్వముఖ ప్రయాణమేకాదు అధోముఖంగా కూడా ఉంటుందని.
మూలాధారచక్రానికి ఇంకొక చిహ్నం - అధోముఖంగా ఉన్నత్రికోణం.ఇది సాధనలో ప్రాధమిక దశలో ఉండటాన్ని ఊర్ధ్వ ముఖంగా ఉన్న కోణాలు వికసిస్తున్న చైతన్యానికి మార్గమని చెప్తారు.మూలాధారం ఎరుపు రంగులో ఉంటుంది కనక త్రికోణస్థితుడైన గణపతికి సింధూరలేపనంచేయడం ఒక సాంప్రదాయం. బామే లోని సిధ్ధి వినాయకుడికి, కాశీలోని డూండీ వినాయకుడికి కూడా సిందూర లేపనం చేస్తారు.
మూలాధారం అచేతనావస్థలో ఉంటుంది. అక్కడ వెలలేని రత్నాలు ఉంటాయి, విషసర్పాలు ఉంటాయి.ఇది చేతనం అయినపుడు మనిషిలోని భావోద్రేకాలు బయటకివచ్చి ప్రళయాన్ని సృష్టించవచ్చు, అలాగే ఆనందాన్ని, స్వేచ్ఛని, భగవంతుడితో సన్నిహితంగా ఉన్నాననే భావనని కలిగించవచ్చు. అందుకే పెద్దలు తెలిసీ తెలియని జ్ఞానంతో కుండలిని జోలికి వెళ్ళ వద్దని అంటారు.సరి అయిన మార్గంలో క్రమం తప్పకండా సాధన చేస్తూ ఉంటే పెద్దల ఆశీస్సులు, సద్గురువుల ఆశీస్సులతో పురొేగమనం ఉంటుందనేది స్వానుభవం.

No comments:
Post a Comment