Friday, December 30, 2016

5 ways Karma from past lives affects us today

Karma is the memory of our Souls, which means it’s often long-standing, even stemming from prior lives. Indeed, the course of our current life is mostly predetermined by earlier lifetimes: 
  • What we didn’t finish then will come back for us to finish now
  • What we didn’t make right in our past lives will persistently present itself in this one, like an uninvited guest who would not leave
  • Unpleasant situations are the consequence of lingering karma, which can always be reversed and resolved.

Acknowledge these 5 properties of past-life Karma that still affect you, to erase the energy carried over from former lifetimes.


1.     Karma has No Expiration Date

Karma is the luggage your Soul carries on its trip from life-to-life.  Without even knowing it, you may be experiencing karma that originated several lifetimes ago.

2.     No person in your life — from your mother to your spouse to your mailman — is a coincidence 

Everyone is placed into your life strategically for a reason. While you have the free will to walk away from or remain with a certain person, Karma overpowers free will.

This means that the course of Karmic relationships will play out as planned despite your best efforts.
3.     What you have done, you become 

Thanks to the media, we often think of karma as what goes around comes around. But the reality of karma is more expansive than just being punished for our bad deeds — there exists positive karma, just as much as negative karma. If you stole, others will steal from you in following lives. If you nourished, you will be nourished. Your actions throughout your various lifetimes become the circumstances of your being.
4.     Roles often reverse


One of the most fascinating facts about karma is that it often causes us to reincarnate in a reversed manner. This means that your parent may have been your child in a former life. Then, before reincarnating in this lifetime, the souls agreed the take on the opposite act. Souls switch genders, too.
5.     Karma repeats to produce new results


There’s a greater reason that karma repeats itself, and it’s not to cause you pain; it’s to teach you to take different actions for different results. If you’re attracting the same type of partners into your life repeatedly, it’s time to stop and inspect your choices: Why do similar people keep coming in? What should you be doing differently?

This calls for honest introspection and evaluation of your own faults and weaknesses, which is admittedly hard to do.

Past-life karma is resoundingly present in your current life. Muster up the courage to open your karmic suitcase and rid yourself of its wanted contents today; this act alone will change your destiny for lifetimes to come.

Note: In case of any copyright issues, please contact us before taking any legal course  


Thursday, December 29, 2016

గణపతికి సిందూరం ఎందుకు రాస్తారు? గణపతిని త్రికోణ మధ్యగతం అని ఎందుకు నుతించారు?

గణపతికి సిందూరం ఎందుకు రాస్తారు? గణపతిని త్రికోణ మధ్యగతం అని ఎందుకు నుతించారు?


తల్లి గర్భం శిశువుకి పోషణ ఇచ్చినట్లు మూలాధారచక్రం మనిషిలోని ఆధ్యాత్మిక ప్రగతికి ముాలస్థానమనిచ్చారు.అది చెట్టులోని వేరులాంటిది. మనిషిలోని పూర్వజన్మల కర్మల నిక్షిప్తస్థానంగా చెప్తారు.
మూలాధారానికి గణపతి ప్రతీక.దీని చిహ్నం ఏడు తొండాలతో ఉన్న ఏనుగు.ఇవి మనిషిలొేని సప్తధాతువులని, సప్త చైతన్య స్థాయిలని సూచిస్తుంది.
ఈచక్రానికి నాలుగు దళాలు ఉంటాయి. మనస్సుయొక్క నాలుగు చైతన్యస్థాయి మనో బుద్ధి చిత్త అహంకారాలని ఇది సూచిస్తుంది.అలాగే ఈ గ్రహం మీద ఉండే నాలుగురకాల జీవనాలని(స్వేదజాలు,అండజాలు,వృక్షజాలు,ఆకారంతో జన్మించే పశువులు మనుష్యులు) ఇది సూచిస్తుంది.

శివునిలోని శక్తి పశుపతి మహాదేవరూపంలో ఇక్కడ ఉంటుందంటారు. శివుడు చైతన్యానికి, స్వేచ్ఛకి కారణమంటారు. స్వేచ్ఛ అంటే మనలోని దుష్టశక్తులని సంహరించడం. పశుపతి మహాదేవ అంటే జంతువులను నియంత్రణలో ఉంచడం. మూలాధారచక్రం జంతు చైతన్యానికి మానవ చైతన్యానికి ఒక సరిహద్దు అని చెప్పవచ్చు.
అంటే జంతువులలో నిద్రాణంగా ఉండే చైతన్యస్థాయి నుండి మానవులలో బుధ్థి వికాసంచే స్థాయి వరకు ఎదగడం. శివునికి ఇరువైపులా రెండు శక్తులు ఉంటాయి. అసురీశక్తి దేవిశక్తి.
మూలాధారానికి ఇంకొక చిహ్నం శివలింగానికి మూడున్నర చుట్టలు చుట్టుకున్న సర్పం. శివలింగం సృజనాత్మకతకి ప్రతీక. మూడు చుట్టలు మనిషిలోని మూడు చైతన్య స్థాయిలకి సంకేతం. సగం చుట్ట పురోగమించిన చైతన్యానికి ప్రతీక. కిందకి ఉన్న సర్పం ముఖం యొక్క సూచన ఏమిటంటే పరిణామ క్రమంలొే ఊర్ధ్వముఖ ప్రయాణమేకాదు అధోముఖంగా కూడా ఉంటుందని.


మూలాధారచక్రానికి ఇంకొక చిహ్నం - అధోముఖంగా ఉన్నత్రికోణం.ఇది సాధనలో ప్రాధమిక దశలో ఉండటాన్ని ఊర్ధ్వ ముఖంగా ఉన్న కోణాలు వికసిస్తున్న చైతన్యానికి మార్గమని చెప్తారు.మూలాధారం ఎరుపు రంగులో ఉంటుంది కనక త్రికోణస్థితుడైన గణపతికి సింధూరలేపనంచేయడం ఒక సాంప్రదాయం. బామే లోని సిధ్ధి వినాయకుడికి, కాశీలోని డూండీ వినాయకుడికి కూడా సిందూర లేపనం చేస్తారు.
మూలాధారం అచేతనావస్థలో ఉంటుంది. అక్కడ వెలలేని రత్నాలు ఉంటాయి, విషసర్పాలు ఉంటాయి.ఇది చేతనం అయినపుడు మనిషిలోని భావోద్రేకాలు బయటకివచ్చి ప్రళయాన్ని సృష్టించవచ్చు, అలాగే ఆనందాన్ని, స్వేచ్ఛని, భగవంతుడితో సన్నిహితంగా ఉన్నాననే భావనని కలిగించవచ్చు. అందుకే పెద్దలు తెలిసీ తెలియని జ్ఞానంతో కుండలిని జోలికి వెళ్ళ వద్దని అంటారు.సరి అయిన మార్గంలో క్రమం తప్పకండా సాధన చేస్తూ ఉంటే పెద్దల ఆశీస్సులు, సద్గురువుల ఆశీస్సులతో పురొేగమనం ఉంటుందనేది స్వానుభవం.

Wednesday, December 28, 2016

వేదాంతము (ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతముల పరిశీలన)


వేదాంతము (ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతముల పరిశీలన):

వేదాలు అపౌరుషేయాలు. అవి ఎవరో ఒకరి చేత రచింపబడినవి కావు.వేదాలలోని ఉపనిషత్తుల సారమే వేదాంతము.వేదాంతము ప్రకారము మనిషిలో దివ్యత్వం ఉంది.మన చుట్టూ ఉన్నది మనం చూసేది ఆ దివ్యత్వంయొక్క చైతన్యమే.మనిషితత్వంలో ధృఢమైనది,శక్తివంతమైనది, మంచిది ఏదైతే ఉందో అదంతా ఆ దివ్యత్వం యొక్క ప్రతిరూపమే.బయటకి రకరకాలుగా భిన్నంగా కనిపిస్తున్నా మనిషికి, మనిషికి మధ్య అంతరంలేదు.ఆ అనంతమైన మహాసముద్రంలో అందరు తరంగాలు.ప్రతిఒక్కరు ఆ అనంతమైన భగవత్ శక్తిని బయటకి ప్రకటించాలని కోరుకుంటారు.ప్రతి ఒక్కరిలోను ఆ దివ్య తత్వమైన ఉనికి జ్ఞానము ఆనందము అనేది నిజస్వభావంగా జన్మహక్కుగా ఉంది.మనుష్యులలోని అంతరం అంతా లోపల ఉన్న శక్తిని వ్యక్త పరచడంలోనే ఉంది. మనిషిలో బయటకి వ్యక్తమయ్యే అతని స్వభావాన్ని కాకుండా అతని నిజస్వభావాన్ని గుర్తించమని వేదాంతం చెప్తోంది. అందువలన గురువులు మనిషిలొేని దివ్యత్వాన్ని మేల్కొల్పాలి.

బ్రహ్మసూత్రాలు వేదాలలో ఉపనిషత్తులలోని వేదాంతాన్ని చర్చించింది.ఎందరో వేదాంతులు ఉపనిషత్తులకి, బ్రహ్మసూత్రాలకి,భగవద్గీతకి భాష్యంచెప్పారు.
ఆ భాష్యాలు ముఖ్యంగా ముగ్గురు వేదాంతులు రాసినవి ప్రసిద్ధికెక్కాయి. అవి ద్వైతపరంగా భాష్యం చెప్పిన మధ్వాచార్యులవారిది, విశిష్టాద్వైతపరంగా చెప్పిన రామానుజాచార్యులవారిది, అద్వైతపరంగా చెప్పిన శంకరాచార్యులవారిది.

ద్వైతసిధ్ధాంతం:

ఈ సిధ్ధాంతం ప్రకారం సృష్టికర్త సృష్టి వేరు.ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త, ప్రకృతి కంటే మనిషి ఆత్మ కంటే భిన్నమైనవాడు. భగవంతుడు అనంతుడు,ప్రకృతి అనంతమైనది,జీవులు అనంతమైనవారు. ప్రకృతిలోను జీవులలోను మార్పు ఉంటుంది. కానీ పరమాత్మలో ఎటువంటిమార్పు ఉండదు.ఈ సిధ్ధాంతం ప్రకారం పరమాత్మకి గుణాలు ఉంటాయి.ఆయనకి శరీరం ఉండదు కాని మానవ లక్షణాలు ఉంటాయి. భగవంతుడు దయామయుడు, న్యాయమూర్తి, శక్తిమంతుడు, సర్వవ్యాపి.అతని వద్దకు వెళ్లవచ్చు, ప్రార్ధింపవచ్చు, ప్రేమించవచ్చు. ఆయన కూడా మనలని ప్రేమిస్తాడు.మానవులలో ఉండే దుర్గుణాలు ఉండవు అన్నీ సుగుణాలే ఉంటాయి.
ద్వైత సిధ్ధాంతం ప్రకారం ప్రతి ఆత్మకి మోక్షం ఉంటుంది.ఎవరు వదలి పెట్టబడరు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాక, సుఖదుఃఖాలు అనుభవించాక అందరు అక్కడకి చేరుకుంటారు.

ద్వైతమతరత్నాలు

1)శ్రీహరి సర్వోత్తముడు.
2)జగత్తు సత్యము.
3)ఈశ్వరుడు,జీవులు,జడములు - వీటిమధ్య పంచ బేధాలు కలవు.
4)జీవులు అస్వతంత్రులు మరియు పరమాత్ముని సేవకులు.
5)జీవులు స్వరూపత భిన్నులు మరియు తారతమ్యము కలవారు.
6స్వరూపానుభూతే ముక్తి అనబడును.
7)పరమాత్మునియందు నిరతిశయ అచంచల భక్తి ఎల్లపుడు చేయుటయే ముక్తికి సాధనము.
8) ప్రత్యక్షము,అనుమానము,ఆగమములనునవి మూడు ప్రమాణాలు.
9)పరమాత్ముని వేదములవలననే తెలియనగును.

విశిష్టాద్వైతము:

ఉపనిషుత్తులకి, బ్రహ్మసూత్రాలకి, భగవద్గీతకి విశిష్టాద్వైత సిధ్ధాంతం ప్రకారం శ్రీరామానుజాచార్యుల వారు భాష్యం రాసారు.ఈ సిధ్ధాంతం ప్రకారం భగవంతుడే సృష్టి, సృష్టికర్త. కార్యం, కారణం ఆయనే.అంతా భగవంతుడే.దివ్యత్వం ఒక్కటే. దానిని నారాయణుడని, విష్ణువని అంటారు.జీవులందరు నారాయణుని అంశలు. జీవులని చిత్త అంశ అని ప్రకృతిని అచిత్తఅంశ అని బ్రహ్మని చిత్త అచిత్త విశిష్ట బ్రహ్మ అని అంటారు.

వేదాలలో చెప్పినట్లు సాలెపురుగు తన లాలాజలంతో గూడుని నేసినట్లు ఈ సృష్టి అంతా భగవంతుడిచే నేయబడిందని వీరి సిధ్ధాంతం. ఉన్నది ఒక్కటే జీవులందరు ఆ దివ్యత్వం యొక్క భాగాలు అని గ్రహించడమే మోక్షం.జ్ఞానంకంటే భక్తికే వీరు ప్రాధాన్యతని ఇస్తారు.

ఈసృష్టి అంతా పరమాత్మదే.ప్రకృతి జీవులు పరమాత్మ శరీరం. మనిషికి శరీరం మరియు ఆత్మ ఉన్నట్లే ఈసృష్టిలోని జీవులందరు పరమాత్మ శరీరం.పరమాత్మే అందరిలో ఉన్న ఆత్మ.

ద్వైతులు విశిష్టాద్వైతులు ఇరువురు కూడా స్వాభావికంగా ఆత్మ పరిశుధ్ధమైనదని కర్మల ద్వారానే అది మలినం అవుతుందని ఒప్పుకుంటారు.చేసే ప్రతి మంచి పని ఆత్మని కుంచింప చేస్తుందని మంచి పని ఆతనిని వికసింప చేస్తుందని అంటారు.మండే జ్వాలనుండి నిప్పురవ్వలు వచ్చినట్లు పరమాత్మ నుండి ఆత్మలు వచ్చాయని వీరి సిధ్ధాంతం.ప్రతి ఆత్మకి ఒకే లక్ష్యం ఉంటుంది.

అద్వైత సిధ్ధాంతం:

శ్రీశంకరాచార్యులవారు అద్వైత సిధ్ధాంత పరంగా ఉపనిషత్తులకి , బ్రహ్మసూత్రాలకి, భగవద్గీతకి భాష్యంరాసారు. ఈ సిధ్ధాంతం ప్రకారం ఉన్నది ఒక్కటే ఉనికి ఒక్కటే - చైతన్యం. ఉన్నది ఒక్కటే అని తెలియక అనేకంగా ఉన్నాయని భ్రమ పడుతున్నాము.
ఈ సిధ్ధాంతం ప్రకారం భగవంతుడే నిమిత్త కారణం, ఉపాదానకారణం. ఆయన సృష్టికర్తేకాదు, సృష్టికూడా ఆయనే.అంత పవిత్రమైన భగవంతుడు సృష్టికింద మారడం ఏమిటి అని అనుకుంటే వారిచ్చే సమాధానం. ఈ జగత్తంతా మిధ్య. అసలు ఉన్నది ఒక్కటే. అనంతమైనది, సత్యమైనది ఒక్కటే. ఒక్కటే ఉనికి. అందరిలోను ఉన్నది ఒక్కటే ఆత్మ. తెలిసినదాని వెనకాల తెలియనిదాని వెనకాల ఉన్నది ఒక్కటే ఆత్మ. ఆ ఆత్మ ద్వారానే మనం ఈ జగత్తుని చూస్తున్నాము. చరము అచరము అన్నీకూడా ఆత్మే.నామరూపాలు తీసివేస్తే ఉన్నది ఆత్మే. ఆత్మకి లింగ బేధం లేదు. ఆత్మ సూర్యునికంటే నక్షత్రాలకంటే, దేవతలకంటే అత్యున్నతమైనది. శాస్త్రాలుకాని గ్రంధాలుకాని మనిషిలో నెలకొనిఉన్న ఆత్మ యొక్క విశిష్టతని చెప్పజాలవు.
అద్వైత సిధ్ధాంతంలొే అతి క్లిష్టమైన ప్రశ్న, పదే పదే అడిగే ప్రశ్న, దానికి ఇప్పటికి సరి అయిన సమాధానం రాని ప్రశ్న అపరిమితమైన ఆ పరమాత్మ పరమితం ఎలా అయ్యాడు?

దానికి స్వామి వివేకానంద ఈకింద విధంగా సమాధానం చెప్పారు.

                A
       Absolute(పరమాత్మ)

                  C
       Time (కాలము)
       Space( ఎడము,ఖాళీ, ఆకాశము)
        Causation(కారణము)

                 B
        Universe(జగత్తు)

A.పరమాత్మ. B.ప్రపంచం. పరమాత్మ ప్రపంచంగా మార్పు చెందాడు. ప్రపంచం అంటే భౌతిక ప్రపంచమే కాకుండా మానసిక ఆధ్యాత్మిక జగత్తు గ్రహాలు నక్షత్రాలు ఉనికిలోకి వచ్చినవన్నీ.

మనస్సు మార్పు చెందేది. శరీరం మార్పు చెందేది. సృష్టి మార్పులతో కూడుకున్నది. పరమాత్మ time, space, causation ద్వారా ప్రపంచంగా మార్పు చెందాడు. ఈ మూడింటిని కలిపి మాయ అని అంటారు.అద్వైత సిధ్ధాంతంలో ఇది ముఖ్యమైన సిధ్ధాంతం.

Time,space, causation అనేవి అద్దంలాంటివి. కింద స్థాయినుండి చూస్తే ప్రపంచం కనిపిస్తుంది. పరమాత్మలో మాత్రం time, space, causation అనేవి ఉండవు. ఎందుకంటే అక్కడ మనస్సు కాని ఆలోచన కూడా ఉండదు. బాహ్యంగా ఎటువంటి మార్పు ఉండదు కనుక అక్కడ space ఉండదు.ఒక్కటే ఉన్నపుడు కదలిక కాని కారణంకాని ఉండదు. దీనిని మనం బాగా అర్ధం చేసుకోవాలి,వంట పట్టించుకోవాలి.

అద్వైతం అంటే ఒక్కటేకదా. మరి ఇక్కడ పరమాత్మ time space causation(మాయ) ద్వారా అనేకంగా మార్పు చెందాడు కదా మరి రెండు ఉన్నట్లు కదా అని కొంతమంది అంటారు.

దానికి అద్వైతులు చెప్పే సమాధానం రెండు ఉండాలి -  అంటే రెండూ స్వతంత్రంగా ఉండాలి. మాయ అనిపిలిచే ఆ మూడింటికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు.కాలము అనేది ఎప్పుడు మారిపొేతూ ఉంటుంది. Space చాలా సూక్ష్మమైనది. అది ఏమిటో మనకు తెలియదు అయినా అన్నింటలోనూ వ్యాపించి ఉంది.

ప్రపంచమంతా పరమాత్మ స్వరూపం. పరమాత్మ సముద్రమైతే ఈ కనిపించేదంతా చరము అచరము అందులో తేలుతున్న అలలు. అల సముద్రం కంటే భిన్నంగా ఎప్పుడు అవుతుంది. నామ రూపాల ద్వారా. కెరటం మాయమవగానే నామరూపాలు ఉండవు అది సముద్రమే అవుతుంది. అలాగే మాయ తొలగి పొేగానే మనిషి స్వేఛ్ఛని పొందుతాడు.