Wednesday, January 4, 2017

మానవుడి అభివృధ్ధి మరియు మానసిక పరిణితి

మానవుడి అభివృధ్ధి ఏరంగంలోనైనా అతని మానసిక పరిణితిమీద ఆధారపడి ఉంటుంది. ఆత్మ సహజంగా శుధ్ధమైనది, పవిత్రమైనది. కనుక ఆత్మ పురోగమించడం అంటూ ఉండదు. సుఖదుఖ్ఖాలు, బలహీనతలు, జ్ఞానము-అజ్ఞానము, బంధము-మోక్షము ఇవన్నీ మన మానసిక పరిస్థితిమీద ఆధారపడి ఉంటాయి. మనిషిని పురోగమించకుండా అడ్డుకునేది మనస్సులోని మాలిన్యాలే. మనస్సుకి ఆత్మకి మధ్య బేధం ఉందని వేదాంతం చెబుతుంది. ఆత్మ శుధ్ధమైనది,  దానికి ఎటువంటి మార్పులేదు. మనస్సుకూడా అతి సూక్ష్మమైన భౌతిక పదార్ధం. అందువలననే దానికి చైతన్యాన్ని జ్ఞానాన్ని వ్యక్త పరిచే సామర్ధ్యంఉంది. ప్రధమంగా మనస్సుకూడా పరిశుధ్ధమైనది. మనస్సుద్వారానే జ్ఞనాన్ని గ్రహిస్తాము. మనస్సు పరిణితి చెందనపుడు, కలత చెందినపుడు నిలకడగా ఉండలేదు. పతంజలి మహర్షి మనస్సు 5 రకాల దోషాలవలన కలత చెందుతుందని చెప్పారు.

అవిద్య అంటే ఏదైతే సత్యమో దానిని మరిచి పోవడం అసత్యమైనదానితో  తాదాత్మ్యత చెందడం. తన నిజ స్వభావం భగవంతుడితో తనకుకల సంబంధం తెలియకపోవడం. అహంకారం మనస్సుని తానుగా భ్రమించి  ప్రపంచంతొే  తాదాత్మ్యత చెందడం. దీనివలన అశాశ్వతమైనవాటిపై విపరీతమైన మోహం.

మమకారం, ద్వేషం. నిత్యజీవితంలో మనం ఎదుర్కొనే భావోద్వేగాలను  పరిశీలిద్దాము. సహజంగా మనిషిలో ఉండే స్థూలమైన ఆవరణలు - కోపం, అసూయ, ద్వేషం, తీవ్రమైన కోరిక, మనం అనుకున్నట్లు జరగక పోతే తీవ్రమైన అసంతృప్తి, తద్వారా అశాంతి. దీనివలన విచక్షణాజ్ఞానం కోల్పోవడం, సరైన నిర్ణయాలు తీసుకొేలేకపొేవడం జరుగుతుంది. దానివలన మనస్సు బలహీన పడుతుంది.

రెండవది నకారాత్మకమైన ఆలో చనలు. భావోద్వేకాలు లేకపొేయినా మనిషిలో  విపరీతమైన ఆలోచనలుఉంటాయి. ఎప్పుడూ గతంలోనే ఉండటం, గతంలోని సంఘటనలనే తలచుకోవడం, ఎవరివలనైనా బాధ కలిగితే వారి గురించిన ఆలోచనలతో ఎక్కడెక్కడికో  వెళ్ళిపోవడం. మనం తీసుకున్న నిర్ణయమే సరిఅయినది అనుకోవడం, అర్ధంలేని సందేహాలు మూఢనమ్మకాలు, పక్షపాతాలు ఇవికూడా మనస్సుని బలహీనపరుస్తాయి. అర్ధంపర్ధంలేని భయాలు, చంతలు ఇవన్నీకూడా మాలిన్యాలే. ఇవన్నీ యదార్ధంమీద కాకుండా ఊహలమీద ఆధారపడిఉంటాయి.

ఇంద్రియాలద్వారా మనకు అనుభవాలు కలుగుతాయి.కొన్ని అనుభవాలు వాటివలన వచ్చే అనుభూతులు మనస్సుమీద చెరగని ముద్రలు వేస్తాయి. ఇవే జన్మజన్మలనుండి నిక్షిప్తంగాఉంటాయి. వీటినే సంస్కారాలు అనిఅంటారు. నిక్షిప్తంగా దాగిన సంస్కారాలు మూడు స్థితులలో  ఉంటాయి. దాగిఉన్నస్థితి, విజృంభించిన స్థితి, బలహీనపడిన స్థితి.

మనఆలోచనలు నకారాత్మకంగా ఉన్నపుడు  అటువంటి వ్యక్తులతోనే అలాంటి ముద్రలే ఏర్పడడం జరుగుతుంది. తద్వారా భవిష్యత్తులో మళ్ళీ అటువంటి సంఘటనలనే ఎదుర్కోలేకపోవడం జరుగుతుంది. మనలోపల ఉన్న సంస్కారాలమీద మన ఆలోచనలమీద మనవ్యక్తిత్వం ఆధారపడిఉంటుంది. అందువలన మనవ్యక్తిత్వాన్ని మలచుకొేవాలి, మన  ఆలోచనావిధానాన్నిమార్చుకొేవాలి.

వ్యక్తిత్వవికాసానికి భగవద్గీత ముఖ్యమైన ఆధారము. ఆరోవ అధ్యాయము, ఐదవ శ్లోకం ఇలా చెప్పబడింది:

ఉద్దరే దాత్మనాత్మానం నాత్మాన మవసాదయేత్ |
ఆత్మైవహ్యాత్మనో బన్దు రాత్త్మెవ రిపురాత్మనః || 

మనస్సుని హీన స్థితికి తెచ్చుకోకూడదు. దానిని తనకు తాను ఉద్దరించుకోవాలని భగవద్గీత చెప్తోంది.

No comments:

Post a Comment